- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖర్చు 50 కోట్లు.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీఆర్ఎస్ పార్టీ (BRS Party) 50 కోట్లు ఖర్చు పెట్టిందని మెదక్ (Medak) బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan rao) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీఆర్ఎస్ పార్టీ (BRS Party) 50 కోట్లు ఖర్చు పెట్టిందని మెదక్ (Medak) బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan rao) ఆరోపించారు. ఇవాళ ఓ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని (Telangana Movement), టీఎన్జీవో (TNGO) ఉద్యమాన్ని బాగా నడిపించామని బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) చెబుతారని, ఆఖరికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి లేకుండా పోయాడా అని ప్రశ్నించారు.
ఇటీవల జరిగిన వరంగల్, నల్గొండ, ఖమ్మం (Warangal- Nalgonda- Kammam) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections).. పక్క పార్టీ వ్యక్తిని బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిపిందని, ఆయనను గెలిపించేందకు నానా హంగామా చేశారని అన్నారు. ఆ ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు పెట్టి, నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను ఇంచార్జిగా పెట్టిన దిక్కు లేకుండా పోయిందని విమర్శలు చేశారు. కరీంనగర్ (Karimnagar), మెదక్ (Medak) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ మొఖం చాటేసిందని, సొంత జిల్లాలో పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారో చెప్పాలని అన్నారు. కాగా కొద్ది రోజుల్లో జరగబోయే ఎమ్మె్ల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తంగా లేనట్టు కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ మాటలు చర్చనీయాంశంగా మారాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించని బీఆర్ఎస్ పార్టీ తీరు చూస్తుంటే రఘునందన్ రావు మాటలు నిజమేనా అనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో కలుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఎదురు చూస్తున్నా.. పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారి ఆశలపై నీళ్లు జల్లినట్టు అవుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి కార్యకర్తల్లో ఉత్సహాం నింపేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలలోని లోటుపాట్లు ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచి.. ఈ ఉత్సహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






