- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భట్టి కుమారుడి నిశ్చితార్థానికి కవిత.. చీర డిజైన్‌పై బీఆర్ఎస్ ట్రోల్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కవిత మూడు రంగుల చీరను ధరించి వచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కవిత మూడు రంగుల చీరను ధరించి వచ్చారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కూడా ఉండగా వీరు కాబోయే జంటను ఆశ్వీర్వదించారు. అయితే ఈ వేడుకలో కవిత కట్టుకున్న చీర ఇప్పుడు ట్రోల్స్‌కు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్న చీరను కవిత కట్టుకున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులు చేస్తోంది.
ఉదయం కాంగ్రెస్ గద్దెలు కూల్చమని బీసీ సోదరులకు పిలుపునిచ్చి సాయంత్రం కాంగ్రెస్ మంత్రి ఇంట్లో వేడుకకు హాజరైందని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా కవిత కాంగ్రెస్ లో చేరుతున్నట్టు హింట్ ఇస్తున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే జైలు నుండి వచ్చిన తరవాత కవిత తన తండ్రి కేసీఆర్ కు పార్టీ గురించి ఓ లేఖ రాయగా అది లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు అయిన హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు.
హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలో కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయగా ఆమె తన ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసి ప్రస్తుతం జాగృతిలోనే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సొంత పార్టీ పెట్టబోతున్నారు అంటూ అనేక వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడే అలాంటి ఆలోచన లేదని, ముందు జనం సమస్యలు తీర్చాలని కవిత స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్‌కు దూరం అయిన తరవాత కవితపై ట్రోల్స్ పెరగ్గా ఇప్పుడు ఆ డోస్ మరింత పెరిగినట్టు కనిపిస్తుంది. tweet






