- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వేదిక... వీడియో వైరల్
గులాబీ పార్టీ ( BRS) నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 27వ తేదీన ఆదివారం జరగబోతున్న ఈ భారీ

దిశ, వెబ్ డెస్క్ : గులాబీ పార్టీ ( BRS) నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 27వ తేదీన ఆదివారం జరగబోతున్న ఈ భారీ బహిరంగ సభకు... అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా....తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే.. తాజాగా ఓ వీడియోను కూడా వదిలింది గులాబీ పార్టీ.
ఈ నెల 27వ తేదీన నిర్వహించబోయే ఈ గులాబీ పార్టీ రజ తోత్సవ మహాసభ ( BRS Meeting)... దాదాపు 1300 ఎకరాలలో.. నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ( Elkathurthi, Hanumakonda district) ప్రాంతంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 400 నుంచి 500 మంది అతిథులు ఈ సభకు వస్తారని గులాబీ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అలాగే రాజ్యసభ సభ్యులు, పార్టీ కీలక నేతలు కూడా ఉంటారు.
ఇక ఈ సభకు 10 లక్షల మంది జనాభా వచ్చేలా... భారీ ప్లాన్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా 3000 వరకు వినియోగించుకోనున్నారట. దీనికోసం ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ సంస్థకు 8 కోట్లు కేసీఆర్ పార్టీ ఇచ్చిందని చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం... జనాల్లో పెద్దగా కనిపించని కేసీఆర్ ( KCR)... అసెంబ్లీకి కూడా సరిగా రావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏడాదిన్నర సమయం ఇస్తానని ముందే ప్రకటించిన కేసీఆర్... ఇప్పుడు బయటికి వస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సభ కూడా నిర్వహిస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ వేదిక...#BRSat25 #KCR #Telangana pic.twitter.com/qBTeoaW803
— Sarita Avula (@SaritaAvula) April 22, 2025






