- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kaleshwaram Commission: కేసీఆర్ విచారణ సందర్భంగా BRS బలప్రదర్శన
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమిషన్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్న సందిగ్ధత వీడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమిషన్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్న సందిగ్ధత వీడింది. వచ్చేనెల 5న విచారణకు హాజరుకావాలని ఇటీవల కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీచేసింది. ఆయనతోపాటు మాజీమంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు సైతం నోటీసులు పంపించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ నోటీసులపై పూర్తిస్థాయిలో స్టడీ చేసిన కేసీఆర్.. విచారణకు హాజరవ్వాలనే డిసైడ్ అయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ఆ రోజు బలప్రదర్శన చేయనున్నట్లు తెలిసింది. గులాబీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్‌కు మద్దతుగా నిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
5న కేసీఆర్, 9న హరీశ్‌రావు..
కాళేశ్వరంపై విచారణలో భాగంగా ఇప్పటివరకు విచారించిన అధికారులు, ఏజెన్సీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఇదే క్రమంలో కాళేశ్వరం లొకేషన్, డిజైన్, నిర్మాణం పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని వారు స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాంతో కమిషన్ ఫైనల్‌గా కేసీఆర్‌ను విచారణకు ఆహ్వానించింది. ఈ మేరకు నోటీసులు పంపించింది. ఆయనతోపాటు గత ప్రభుత్వంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్‌కు సైతం నోటీసులు పంపించారు. కేసీఆర్‌ను వచ్చేనెల 5వ తేదీన హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే.. ఈటలను 6వ తేదీన అటెండ్ కావాలని సూచించారు. ఇక హరీశ్‌రావును ముందుగా 6వ తేదీనే హాజరుకావాలని చెప్పిన కమిషన్.. ఆ తేదీని 9వ తేదీకి మార్చినట్లు తెలిసింది. దాంతో ఆయన 9న విచారణకు అటెండ్ కానున్నారు. కేసీఆర్‌కు నోటీసులు అందడంతో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డాక్యుమెంట్లు, రికార్డ్స్ తెప్పించి పూర్తి సమాచారాన్ని సేకరించారని తెలిసింది.
ప్రజల్లో నెగెటివ్ థింక్ రాకుండా..
గతంలో అధికారంలో ఉన్న వేళ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పలు ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇక కాళేశ్వరం మీద సమయం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్‌ను సీఎం, మంత్రులు నిలదీస్తూనే ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్‌ను ప్రజల్లో దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో పలు అక్రమాలపై ఎంక్వయిరీ కమిషన్లను సైతం వేసింది. అందులో భాగంగా గతంలో విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే.. ఆ కమిషన్ సైతం కేసీఆర్‌ను విచారణకు పిలిచింది. కానీ.. తాను విచారణకు హాజరుకాలేనంటూ కేసీఆర్ రాతపూర్వకంగా రిప్లై ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కాళేశ్వరం విచారణకు సైతం హాజరుకాకుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధినేత భావించారు. పార్టీకి డ్యామేజీ జరిగే ప్రమాదమూ లేకపోలేదు. అందులో భాగంగానే విచారణకు నేరుగా హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
కేసీఆర్ విచారణ సందర్భంగా బలప్రదర్శన
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంలో పాల్గొనేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్, అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇప్పటికే లండన్ చేరుకున్న కేటీఆర్.. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆయన వచ్చేనెల 4నే హైదరాబాద్ చేరుకోనున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆయన తన పర్యటనను తొరగానే ముగించుకొని వస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ విచారణ నేపథ్యంలో పార్టీ బలప్రదర్శన చూపించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు పార్టీ తరఫున ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. కేసీఆర్‌కు మద్దతుగా విచారణ జరిగే ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలించేందుకు అందరినీ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.






