- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thummala: కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. బీఆర్ఎస్‍కు మంత్రి తుమ్మల ప్రశ్న
బీఆర్ఎస్ పెద్దల ఇంట్లో కుంపటి రాష్ట్రం అంతా పెట్టొద్దని మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) విమర్శించారు. బీఆర్ఎస్ (BRS) పెద్దలు తమ ఇంట్లో కుంపటి రాష్ట్రం అంతా పెట్టొద్దని, ముందు మీ ఇంటి ఆడబిడ్డ (కవిత) అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిన్నింగ్ మిల్లులు సమ్మె చేయడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరియే కారణం అని ఆరోపించారు. పత్తి కొనుగోలు జరపాలని ప్రధాని మోడీ (Modi) ప్రకటన చేస్తారు. మరో వైపు సీసీఐ నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎంఎస్‍పీకి పంటలు కొనే రాష్ట్రం తెలంగాణ అన్నారు. 20 శాతం వరకు తేమ ఉన్నా పత్తి కొనాలని సీసీఐకి చెప్పాం. ఎకరాకు 7 క్వింటాలు పత్తి నిబంధన ఎత్తివేయాలని స్పష్టం చేశామన్నారు. సీసీఐ నిబంధనలు మార్చి రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనాలన్నారు.
నిన్న కవిత కామెంట్ నేడు తుమ్మల రియాక్ట్:
అయితే జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ లీడర్లను వదులుకోవడం కేసీఆర్ తప్పేనని ఆ ప్రభావం వల్లే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలైందని కవిత అభిప్రాయపడ్డారు. కవిత ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ ముందు కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సమాధానాలు చెప్పాలని తుమ్మల అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.






