SLBC టన్నెల్‌ ప్రమాదం వేళ BRS సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |

నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని SLBC టన్నెల్‌ వద్ద ప్రమాదం(SLBC Tunnel Accident) జరిగి ఎనిమిది మంది కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

SLBC టన్నెల్‌ ప్రమాదం వేళ BRS సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని SLBC టన్నెల్‌ వద్ద ప్రమాదం(SLBC Tunnel Accident) జరిగి ఎనిమిది మంది కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. గత మూడ్రోజులుగా కార్మికులు సొరంగంలోనే ఉండిపోయారు. వారు బతికి ఉన్నారా..? లేదా జరగరానిది ఏదైనా జరిగిందా? అనే విషయం కూడా ఇంతవరకు తెలియరాలేదు. సహాయక చర్యలు మాత్రం మూడ్రోజులుగా నిర్వరామంగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao)లు నిత్యం పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యలో విపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎల్లుండి(గురువారం) ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) వెల్లడించారు. తమ పర్యటనకు పోలీసులు ఆటంకం కలిగించొద్దని సూచించారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే తాము ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదని హరీష్‌ రావు స్పష్ట చేశారు.

అంతకుముందు.. తెలంగాణ భవన్‌లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్ర‌మాదంపై జ్యుడిషీయ‌ల్ క‌మిష‌న్(Judicial Commission) ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదంపైన అందుకు బాధ్యులైన వారిపైన విచారణ చేపట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగిందని ఆరోపించారు.

Next Story