- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rythu Deeksha: రేపు చేవెళ్లలో బీఆర్ఎస్ రైతు దీక్ష
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసానికి వ్యతిరేకంగా, రైతుల పక్షాన రేపు శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గం(Chevella Constituency) షాబాద్ మండల కేంద్రం(Shabad Mandal)లో ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్(BRS)పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష(Rythu Deeksha)కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసానికి వ్యతిరేకంగా, రైతుల పక్షాన రేపు శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గం(Chevella Constituency) షాబాద్ మండల కేంద్రం(Shabad Mandal)లో ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్(BRS)పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష(Rythu Deeksha)కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. ఈ రైతు దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్(KTR) హాజరవుతుని తెలిపింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ హామీలు అమలు చేయకుండా ఎగవేస్తుందని బీఆర్ఎస్ విమర్శించింది. రూ.2లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, రూ.500బోనస్ నామమాత్రం చేశారని, రైతు భరోసాను రూ.15వేల నుంచి 12వేలకు తగ్గించారని, 24గంటల ఉచిత విద్యుత్తు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది.
కాంగ్రెస్ ఎన్నికల హామీల ఉల్లంఘనను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్షలో రైతాంగం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలుపాలని బీఆర్ఎస్ కోరింది. కాగా బీఆర్ఎస్ పార్టీ గత ఏప్రిల్ 6వ తేదీన కూడా మండల, జిల్లా కేంద్రాల్లో రైతు దీక్ష నిర్వహించడం గమనార్హం.






