కొత్త మలుపు తిరగనున్న బీఆర్ఎస్ పాలిటిక్స్.. టీపీసీసీ నేత సామా సంచలన ట్వీట్

by Ramesh Goud |

త్వరలో బీఆర్ఎస్ రాజకీయాలు కొత్త మలుపు తిరగనున్నాయని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి (Congress Media Committee Chairman Sama Ram Mohan Reddy) ట్వీట్ చేశారు.

కొత్త మలుపు తిరగనున్న బీఆర్ఎస్ పాలిటిక్స్.. టీపీసీసీ నేత సామా సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో బీఆర్ఎస్ రాజకీయాలు కొత్త మలుపు తిరగనున్నాయని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి (Congress Media Committee Chairman Sama Ram Mohan Reddy) ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family)పేరుతో రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీలోని వ్యక్తుల ఫోటోను పోస్ట్ చేశారు. దీనిపై ఆయన.. కేసీఆర్ ఫ్యామిలీలో అల్లుడు హరీష్ రావు (Harish Rao) ఎపిసోడ్ ముగిసిందా? అని, కొత్త మలుపు తిరుగనున్న బీఆర్ఎస్ రాజకీయాలు (BRS Politics)! అని రాసుకొచ్చారు.

అంతేగాక టీఆర్ఎస్ కుటుంబంలో మరో వికెట్ రాలబోతుందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు సంతోష్ ను పక్కనపెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా అల్లుడు హరీష్ ను పక్కన పెట్టబోతుండా? అని, వంద కార్ల కాన్వాయ్ తో వరంగల్ సభా వేదిక (Warangal Programe Stage)కి పోయి నేనే అంతా అనే రీతిలో హంగామా చేసిన హరీష్ ఎందుకు ఇంటికి పరిమితమయ్యాడు? అని ప్రశ్నించారు. ఎవరైనా అటుదిక్కు పోతే కాళ్లు విరగ్గొడతానని అన్నారా? అని వ్యాఖ్యానించారు. వరంగల్ సభ ఏర్పాట్ల కోసం కేటీఆర్ (KTR) ను మాత్రమే కేసీఆర్ రోజు ఫామ్ కి పిలుస్తున్నారని, హరీష్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తన బిడ్డ కవిత (Kavitha)ని కూడా వారానికి రెండుసార్లు ఫామ్ హౌస్ కి పిలిచి రాజకీయ ఓనమాల బోధిస్తున్నారని అన్నారు.

ఇదంతా రానున్న రోజుల్లో హరీష్ బీజేపీ (BJP)తో టచ్ లో వెళ్తారని కేసిఆర్ కు గట్టి సమాచారం అయితే కాదు కదా? అంటూ.. లేకపోతే హరీష్ వార్తలు తమ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో సైతం ఎందుకు తగ్గిపోయాయి అని సామా కీలక వ్యాఖ్యలు చేశారు. సామా పెట్టిన ట్వీట్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కేసీఆర్ నిజంగానే హరీష్ రావును పక్కకు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? లేక ఆయనే దూరంగా ఉన్నారా అనే ప్రశ్నలు లెవనెత్తుతున్నారు. ఇదే జరిగితే హరీష్ రావు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు అనేది పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story