ఆ గుర్తులు తొలగించండి..ఎన్నికల కమిషనర్‌కు బీఆర్ఎస్ వినతీపత్రం

by Ajay Maddhiboyina |

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ రాణి కుముదినిని బీఆర్ఎస్ నాయ‌కులు క‌లిశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, సోమ భ‌ర‌త్ స‌హా మ‌రికొంత‌మంది నాయ‌కులు క‌లిసి కారు గుర్తును పోలిన గుర్తుల‌ను తొల‌గించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఆ గుర్తులు తొలగించండి..ఎన్నికల కమిషనర్‌కు బీఆర్ఎస్ వినతీపత్రం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ రాణి కుముదినిని బీఆర్ఎస్ నాయ‌కులు క‌లిశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, సోమ భ‌ర‌త్ స‌హా మ‌రికొంత‌మంది నాయ‌కులు క‌లిసి కారు గుర్తును పోలిన గుర్తుల‌ను తొల‌గించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కారు గుర్తును పోలి మూడు గుర్తులు ఉన్నాయ‌ని వాటిని తొల‌గించాల‌ని కోరారు. రొట్టెపీట‌, కెమెరా, షిప్ గుర్తుల వ‌ల్ల గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ కు రావాల్సిన ఓట్లు ఆ గుర్తుల అభ్య‌ర్థుల‌కు వేసిన‌ట్టు తెలిపారు.

ఆ గుర్తులు చూసేందుకు కారు గుర్తు మాదిరిగానే ఉన్నాయ‌ని చెప్పారు. వాటి వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బారీగా త‌గ్గుతున్నాయ‌ని కాబట్టి తీసివేయాల‌ని విన‌తీప‌త్రం అంద‌జేశారు. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల‌కు కేటాయిస్తున్న కొన్ని గుర్తులు అచ్చం ప్రధాన పార్టీ అభ్య‌ర్థుల‌కు కేటాయించిన గుర్తులను పోలి ఉంటున్నాయి. దీంతో ఆ పార్టీ అభ్య‌ర్థులు న‌ష్ట‌పోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దృష్టిలోపం ఉన్న‌వాళ్లు ఓట్లు వేసేట‌ప్పుడు పార్టీ గుర్తుల విష‌యంలో క‌న్ఫ్యూజ్ అవుతున్నారు.

Next Story