- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MTAR: కార్మిక యూనియన్ ఎన్నికల్లో BRS ఘన విజయం..
హైదరాబాద్- బాలానగర్‌లోని MTAR టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్- బాలానగర్‌లోని MTAR టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఘన విజయం సాధించింది. శనివారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud), బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao)ని ఓడించి, భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. MTAR కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 359 మంది కార్మికులను పర్మనెంట్ చేసి, కార్మికులకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కార్మికులకు బేసిక్‌ను 30% నుంచి 50% కు పెంచడం జరిగిందని, అదేవిధంగా ఇప్పుడు తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో MTAR కంపెనీ BRTU యూనియన్ జనరల్ సెక్రటరీ మాయ రాజయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లు వెంకటేశ్వర రెడ్డి, సమ్మయ్య, రాయుడు యాదవ్ తదితరులు ఉన్నారు. వివరాల కోసం..






