- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR: ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక సమీక్ష.. ఎందుకంటే?
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పార్టీ (25 వసంతాలు) రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ భావిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పార్టీ (25 వసంతాలు) రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha), ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.
వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ విప్ వినయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఎస్‌పీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ చైర్ పర్సన్ రజినీ సాయిచంద్, నవీన్ ఆచారి, పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.






