- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌ను కలిసిన BRS నూతన విప్‌లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు
బీఆర్ఎస్ పార్టీలో నూతన బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ.. సభలో పార్టీ గొంతుకను బలంగా వినిపించాలని వారిని అభినందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో నూతన బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ.. సభలో పార్టీ గొంతుకను బలంగా వినిపించాలని వారిని అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శాసనసభ శాసనమండలిలో తమకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా, విప్‌లుగా అవకాశం కల్పించినందుకు వారు కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమితులైన ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్ రావు, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్సీలు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అధినేత కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. శాసనమండలిలో పార్టీ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కూడా కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.






