Aadi Srinivas: కేసీఆర్ వెనుక ఉండి కథ నడిపించారు

by Gantepaka Srikanth |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బుట్టెంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

Aadi Srinivas: కేసీఆర్ వెనుక ఉండి కథ నడిపించారు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నిక(Telangana Municipal Elections)ల్లో బుట్టెంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను అడ్డుకునేందుకు గతంలో కోర్టుల్లో పిటిషన్లు వేసిన బుట్టెంగారి మాధవరెడ్డి(Buttemgari Madhava Reddy)కి టికెట్ ఎలా ఇస్తారని అన్ని పార్టీలు, బీసీ సంఘాలు బీఆర్ఎస్‌ను ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపురం(పదో వార్డు) నుంచి మాధవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న మాధవరెడ్డిని బీఆర్ఎస్ నాయకత్వం పెంచి పోషిస్తోంది. మాధవరెడ్డి వెనుక బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం ఉంది. కేసీఆరే మాధవరెడ్డి వెనుక ఉండి బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కోర్టులో కేసులు వేయించారు. బీసీ రిజర్వేషన్లు అమలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భయంతో కుట్ర చేశారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

బీఆర్ఎస్‌కు కర్రుకాల్చి వాత పెట్టాలి

మాధవరెడ్డి, కల్వకుంట్ల కుటుంబం కుట్రలు ఇప్పుడు బయటకు వచ్చాయి. బీసీల నోటి కాడ బువ్వను లాక్కున్న వీరిద్దరికి బడుగు బలహీన వర్గాలు బుద్ధి చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు బీఆర్ఎస్‌కు కర్రుకాల్చి వాత పెట్టాలి. గవర్నర్ దగ్గరకు బిల్లు పంపితే ఆమోదించకుండా బీజేపీ అడ్డుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఫెవీకాల్ బంధం ఏకం అయి బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నాయి. రెండు పార్టీలను మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Next Story