MP Vaddiraju Ravichandra : బనకచర్లపై సర్కార్ ప్రజంటేషన్... BRS ఎంపీ వాకౌట్

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Godavari-Banakacherla Link Project)ను అడ్డుకునేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతోంది.

MP Vaddiraju Ravichandra : బనకచర్లపై సర్కార్ ప్రజంటేషన్... BRS ఎంపీ వాకౌట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Godavari-Banakacherla Link Project)ను అడ్డుకునేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఈ మేరకు నేడు హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy) నేతృత్వంలో ప్రాజెక్టుపై ఒక పవర్‌ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేసి, అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించారు. అయితే ఈ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(BRS MP Vaddiraju Ravichandra) వాకౌట్(Walkout) చేశారు.

కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటుందని, సీఎం వ్యాఖ్యలపై తనకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రవిచంద్ర.. సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. కాగా రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం అని, సాగునీటి అంశంలో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోమని, బనకచర్లను అడ్డుకొని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలు బయటికి రావడంతో రవిచంద్రకు ఇబ్బంది కలిగి ఉంటుందని, అందుకే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.

Next Story