కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ.. కొత్తపార్టీని ఆపేందుకేనా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-26 15:32:00  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఇటీవల తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ (Kavitha Letter to KCR) బయటపడటంతో ఏ స్థాయిలో రాజకీయ దుమారం రేగిందో తెలిసిన విషయమే.

కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ.. కొత్తపార్టీని ఆపేందుకేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఇటీవల తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ (Kavitha Letter to KCR) బయటపడటంతో ఏ స్థాయిలో రాజకీయ దుమారం రేగిందో తెలిసిన విషయమే. నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. కవిత రాసిన లేఖ బయటపడటంతో బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలున్నాయన్న విషయం తేటతెల్లమైందని ఇతర రాజకీయపార్టీల నేతలు విమర్శలు చేశారు. ఆ తర్వాత కేటీఆర్ కేసీఆర్ (KCR KTR Meeting)తో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక కవిత కొత్త పార్టీ (Kavitha New Party) పెడుతుందన్న ప్రచారం ఊపందుకుంది. కేసీఆర్ దేవుడే అయినా.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయనడంపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ దెయ్యాలెవరు? ఆమె ఎవరిని ఉద్దేశించి లేఖలో అలా రాశారన్న విషయం చర్చనీయాంశమైంది. కాగా.. తాజాగా బీఆర్ఎస్ (BRS) అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీ దామోదరరావు (MP Damodar Rao) సోమవారం కవితతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జ్ గండ్ర మోహనరావు (Gandra Mohana Rao) కూడా కవితతో సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. అయితే భేటీలో కవితతో వారిద్దరూ ఏం మాట్లాడారు? ఏయే అంశాలపై ప్రస్తావించారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story