రేవంత్ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

by Disha Web Desk 2 |
రేవంత్ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి రావాలని మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానాలు అందాయి. అయితే గులాబీ అధిష్టానం మాత్రం పోవాలని ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. అయితే, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మాత్రం హాజరయ్యారు. వీరిద్దరూ హాజరు కావడంపై బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది. అనుమతితో వెళ్లారా? ప్రొటోకాల్ ప్రకారమే వెళ్లారా? అనేది నేతలు చర్చించుకుంటున్నారు. గుత్తా, బండా మాత్రం ఫ్రొటోకాల్ ప్రకారమే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్లామని స్పష్టం చేశారు. ఇతర కారణాలు ఏవీ లేవని వెల్లడించారు.

Next Story

Most Viewed