MLC Kavitha: ఇది నో స్టాక్ సర్కార్.. ఎక్కడ చూసినా భారీ క్యూ లైన్లే.. కవిత ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

తెలంగాణలో పలు చోట్ల వ్యవసాయ మార్కెట్‌లోని ఎరువుల గోడౌన్‌ల వద్ద యూరియా (Urea) కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

MLC Kavitha: ఇది నో స్టాక్ సర్కార్.. ఎక్కడ చూసినా భారీ క్యూ లైన్లే.. కవిత ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పలు చోట్ల వ్యవసాయ మార్కెట్‌లోని ఎరువుల గోడౌన్‌ల వద్ద యూరియా (Urea) కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. ఈ ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇది నో స్టాక్ సర్కార్.. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాజుగా బతికిన రైతును కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రోడ్డు పాలు చేసిందని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో ఎరువులు, విత్తనాలు అమ్మిన చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం రిపీట్ చేసిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా యూరియా కోసం భారీ క్యూ లైన్ లే కనిపిస్తున్నాయని వివరించారు. యూరియా మాత్రమే కాదు డీఏపీ, పొటాష్ కోసమూ రైతులకు తిప్పలు పడుతున్నారని తెలిపారు.

ముగ్గురు మంత్రులున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి మరీ ఘోరం.. అని విమర్శించారు. వానాకాలం సీజన్ మొదలై నెల రోజులు గడిచిన తర్వాత కూడా ఎరువుల కొరత రైతులను వేధిస్తున్నది అంటే సర్కారు ముందు చూపులేని తనం ప్రణాళికబద్ధంగా వ్యవహరించకపోవడమే కారణం అని విమర్శించారు. సందట్లో సడేమియా అన్నట్టుగా ఉన్న ఎరువులను బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్మే వారిని కట్టడి చేయకుంటే రైతులు మరిన్ని సమస్యల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.

Next Story