- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయిచంద్ మరణం తీవ్రంగా కలచివేసింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు సాయిచంద్ అని కవిత కొనియాడారు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికరమని అన్నారు. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఎమ్మెల్సీ కవిత.
తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం నన్ను ఎంతో కలచివేసింది. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ… pic.twitter.com/hLWKLemSdJ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 29, 2023






