జూన్ 4న కవిత మహాధర్నా.. సాయంత్రం కీలక ప్రెస్ మీట్

by Naga Rani Yarlagadda |

రాజకీయ కార్యాచరణపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కీలక అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కవిత ఇంటికి సమీపంలో జాగృతి కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

జూన్ 4న కవిత మహాధర్నా.. సాయంత్రం కీలక ప్రెస్ మీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ కార్యాచరణపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కీలక అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కవిత ఇంటికి సమీపంలో జాగృతి కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన జాగృతి నూతన కార్యాలయాన్ని సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే మీడియా సమావేశంలో ఆమె కీలక విషయాలపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే జాగృతి తరపున కార్యాచరణను ప్రకటించనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా నోటీసులు ఇవ్వడంపై నిరసన తెలుపుతూ కవిత ధర్నా చేయనున్నారు. జూన్ 4న ఇందిరా పార్క్ (Indira Park) వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తారు. దీనిపై శనివారం సాయంత్రానికి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Next Story