- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌తో కలిసి వచ్చేందుకు సిద్ధం.. MLC కవిత కీలక ప్రకటన
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అంటున్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కాదు.. అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని విమర్శించారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని అన్నారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. అనుముల ఇంటెలిజెన్స్‌ను వాడి కులగణనను తప్పదోవ పట్టించి బీసీకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్ సైట్‌లో పెట్టాము.
మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదని అడిగారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదని అన్నారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో మేము కూడా కలిసి వస్తాం.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందామని కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని ఊదరగొట్టారు కానీ చివరికి ఆయన రాలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడారు. ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవాలంటే వాళ్లకు అర్థమయ్యే భాషలో మాటల్లో మాట్లాడాలని చెప్పారు. ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలి.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాట చేస్తామని కీలక ప్రకటన చేశారు.






