- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాగంటి గోపీనాథ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన BRS MLC
by Gantepaka Srikanth |
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(on Maganti Gopinath) ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(Dasoju Sravan Kumar) కీలక అప్డేట్ ఇచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(on Maganti Gopinath) ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(Dasoju Sravan Kumar) కీలక అప్డేట్ ఇచ్చారు. గురువారం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఐసీయూలో మాగంటి గోపీనాథ్‌కు చికిత్స అందుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. మీడియాలో వచ్చే కథనాలు చూసి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దు అని దాసోజు చెప్పారు. ఇదిలా ఉంటే.. మాగంటి గోపీనాథ్ గురువారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్టు సమాచారం.
Next Story






