ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్

by Naga Rani Yarlagadda |

సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కేబినెట్ బీసీలను మోసం చేస్తున్నదని.. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై కొర్రీలు పెట్టి గవర్నర్..

ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్
X
  • గవర్నర్ వెనక్కి పంపించారని ప్రచారం
  • అసెంబ్లీ పెట్టి కులగణన నివేదిక బహిరంగ పర్చాలి

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కేబినెట్ బీసీలను మోసం చేస్తున్నదని.. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై కొర్రీలు పెట్టి గవర్నర్ వెనక్కి పంపారని ప్రచారం జరుగుతున్నదని.. ఈ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కుట్ర చేస్తూ బీసీల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కులగణన పేరిట రూ.160 కోట్లు ఖర్చు పెట్టారని.. లక్షమంది ఉద్యోగులను వినియోగించారని.. రిపోర్ట్స్ ఎందుకు పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

శాసనసభ శాసనమండలి సభ్యులకు కూడా ఇవ్వడం లేదని అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కులగణనపై జరిగిన సర్వే, కమిషన్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్ సంగతి.. గవర్నర్ వద్ద ఉన్న ఆర్డినెన్స్ సంగతి ఏంటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని.. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేశారు.

Next Story