- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు హైడ్రా కుంభకర్ణ నిద్ర లేచింది: ఎమ్మెల్సీ
హైడ్రా అక్రమ స్టోన్ క్రషర్లపై చర్యలు తీసుకోవడం సరైన నిర్ణయమేనని, దానిలో ఏదో కుట్ర దాగి ఉందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా అక్రమ స్టోన్ క్రషర్లపై చర్యలు తీసుకోవడం సరైన నిర్ణయమేనని, దానిలో ఏదో కుట్ర దాగి ఉందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ఆరోపించారు. కొందరు మంత్రులు రియల్ ఎస్టేట్ ముసుగులో దందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవలో మీడియాతో మాట్లాడుతూ.. మానస హిల్స్‌లో అక్రమ మైనింగ్‌పై మా నేత హరీష్ రావు అసెంబ్లీలో పొలికేక పెట్టారని, వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ మైనింగ్‌కు మంత్రి పొంగులేటి పాల్పడ్డారని అక్కడకు వెళ్లి నిరూపించినట్లు పేర్కొన్నారు. ప్రజా ఆస్తులు, పర్యావరణాన్ని ద్వంసం చేస్తున్న విషయాన్ని ఫిబ్రవరిలో బయట పెట్టామని 60 రోజుల తర్వాత హైడ్రా కుంభకర్ణ నిద్ర లేచిందని ఎద్దేవా చేశారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు పతివ్రతల్లా మాట్లాడారని, పర్యావరణ విద్వంసం గురించి తాము చెప్పినపుడు హైడ్రా ఏం చేసిందన్నారు. మంత్రి సీట్లో కూర్చుని పొంగులేటి చిల్లర వేషాలు వేస్తున్నారని, రెండు నెలల పాటు సీఎం రేవంత్, హైడ్రా రంగనాథ్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్‌చేశారు. ఇన్నేళ్ల పాటు పొంగులేటి తరలించిన రూ. 500 కోట్ల విలువైన మైనింగ్ సంపదను తిరిగి ఎలా రాబడుతారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పొంగులేటికి ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో కూర్చునే హక్కు లేదని, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు.
బిహార్ కంటే దారుణంగా రాష్ట్రంలో పరిస్థితులు..
అక్రమ మైనింగ్ పై కూడా సీబీఐ దర్యాప్తునకు గవర్నర్ ఆదేశించాలని, భాగ్యలక్ష్మి మినరల్స్ పేరిట మరో తెలంగాణ అల్లుడు అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా హోర్డింగ్‌లు పెడితే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారు సుద్దపూసల్లా కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేయాలని పేర్కొనడం సరికాదన్నారు. అనంతరం ఆపార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగిస్తూ.. భాగ్యలక్ష్మి మినరల్స్‌కు ఎలాంటి పత్రాలు లేకున్నా ట్రాన్స్ కో విద్యుత్ కనెక్షన్ ఎలా ఇస్తుందని, సీఎం బంధువు అనే ట్రాన్స్-కో అధికారులు అక్రమంగా కనెక్షన్ ఇచ్చినట్లు కనిపిస్తుందన్నారు. విద్యుత్ చట్టం ప్రకారం అక్రమాలకు పాల్పడిన అధికారులు జైలుకు వెళ్లక తప్పదన్నారు. క్రిశాంక్ ను సంవత్సరం పాటు జైల్లో ఉంచేలా సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారని, నిజానికి జైల్లో పెట్టాల్సింది రేవంత్ రెడ్డి, పొంగులేటి లాంటి వారి మాత్రమే అన్నారు. కరీంనగర్ లో పట్టపగలు నగల దుకాణంలో దొంగతనం జరిగితే మంత్రులు ఏం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్‌కు కూత వేటు దూరంలో ఈ ఘటన జరిగితే ఆయన ఏం చేస్తున్నారని నిలదీశారు. బిహార్ కన్నా రాష్ట్రంలో పరిస్థితులు ఘోరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.






