BRS MLAs: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా..

by Ramesh Naini |

అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు.

BRS MLAs: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా..
X

దిశ, డైనమిక్ బ్యూరో: (assembly) తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) మెరుపు ధర్నా నిర్వహించారు. (Party defections) పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అంతకు ముందు ఫిరాయింపుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలను పాటించాలని స్పీకర్‌ను కలవడానికి సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో (Gandhi statue) గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు.

Next Story