ఆ 15 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎవరికి ఓటేశారు.. ఉప రాష్ట్రపతి ఎన్నికపై BRS MLA సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఉప రాష్ట్రపతి ఎన్నిక(Vice President Election)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ 15 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎవరికి ఓటేశారు.. ఉప రాష్ట్రపతి ఎన్నికపై BRS MLA సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి ఎన్నిక(Vice President Election)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉప రాష్ట్రపతి ఎన్నికతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. సుదర్శన్ రెడ్డికి కేవలం 300 ఓట్లే వచ్చాయని.. మిగిలిన 15 ఓట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. తెలంగాణలోని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఓటేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా భారత 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నికయ్యారు. మొత్తం 781 మందిగానూ 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాధాకృష్ణన్‌ 452 ఓట్లు సాధించగా.. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి 300 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాళీదళ్‌ సభ్యులు దూరంగా ఉన్నారు. ఓటింగ్‌కు 14 మంది గైర్హాజరు కాగా.. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

Next Story