- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: ఎరువుల కొరతపై బీఆర్ఎస్ పోరు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్
ఎరువుల కొరతపై బీఆర్ఎస్ పోరు చేపట్టింది. రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎరువుల కొరతపై (BRS) బీఆర్ఎస్ పోరు చేపట్టింది. రైతులకు సరిపడా యూరియా (Urea) ఇవ్వాలని (BRS MLAs, MLCs) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషన్ వద్దకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా వెళ్లారు. అగ్రికల్చర్ కమిషనర్‌కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో ముందు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్య పైన సరైన వివరాలు అందించి పరిష్కార మార్గాలు చూపించేదాకా కదిలేది లేదని నేతలు నిరసన తెలిపారు. పదేళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. వర్షంలో తడుస్తూ, అర్ధరాత్రులు ఎరువుల కోసం మహిళా రైతులు రోడ్ల మీద నిలబడి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకోని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌తో సహా పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ ముందు మెరుపు ధర్నాకు దిగారు. హరీశ్‌రావు రన్నింగ్ చేస్తూ సచివాలయం గేటు వద్దకి వచ్చి బైఠాయించి నిరసనలు తెలిపారు. ఇక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.






