- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ విగ్రహం వద్ద హైటెన్షన్.. పోలీసుల అదుపులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ(Telangana Assembly) నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy)ని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు(BRS MLAs ) ఆందోళన చేశారు. విరిమించాలని పోలీసులు విజ్ఙప్తి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతకూ వినకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు ఉన్నారు.
కాగా, అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేము కూడా ప్రజలు ఎన్నుకుంటేనే సభలోకి వచ్చాం. మీరు మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు. ఈ సభ మీ సొంతమేం కాదు’ అని స్పీకర్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో రగడ స్టార్ట్ అయ్యింది. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినా జగదీష్ రెడ్డి తగ్గలేదు. దీంతో సభ్యుల డిమాండ్ మేరకు జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.






