- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడిషనల్ కలెక్టర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నాదర్గుల్‌లోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.

దిశ, ఇబ్రహీంపట్నం : నాదర్గుల్‌లోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం నాదర్గుల్ రెవెన్యూ పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసే 373 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజ్ శ్రావణ్, వాణిదేవి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య, పట్నం నరేందర్ రెడ్డిలు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 673లో 373 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమార్కులు బౌన్సర్లను అడ్డం పెట్టుకొని 600 మంది రైతులకు చెందిన భూమిని ఓ మంత్రి కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అక్రమార్కులు ల్యాండ్ చుట్టూ రేకులతో భారీకేడ్లు నిర్మించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టులకు సంబంధించిన భూముల్లో, రైతులకు భూముల్లోని బోర్లను పగలకొట్టడం, వ్యవసాయం చేసుకొనే రైతులను కొడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ భూములలో కాంగ్రెస్ నాయకులు అక్రమ షెడ్లు వేస్తుంటే అధికారుల చర్యలు తీసుకోకపోవడంపై అంతర్యామేమిటని వారు ప్రశ్నించారు. ఈ ఘటనపై స్థానిక ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ భూములను సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాపాడాలని వారు డిమాండ్ చేశారు.






