- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సస్పెండ్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) జోరుగా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) జోరుగా కొనసాగుతున్నాయి. గురువారం గవర్నర్ ప్రసంగానికి (Governor Speech) ధన్యవాదాలు తెలిపే తీర్మాణం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల (BRS, Congress Leaders) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (BRS MLA Jagadeesh Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఆయనను వెంటనే సస్పెండ్ (Suspend) చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) పట్టుబట్టారు.
దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speakar Gaddam Prasad Kumar) మాజీమంత్రి జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) స్పందించారు. అసెంబ్లీలో జరిగిన రగఢకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము సభ, స్పీకర్ యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నామని, కుర్చీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అగౌరవకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే ప్రతిపక్ష సభ్యులు ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. అంతేగాక అన్‌పార్లమెంటరీ భాషలో (Unparliamentary Language) మాట్లాడే వారిపై కఠిన చర్యలు (Strict Actions) తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇక మర్యాద, గౌరవం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి అందరం కలిసి పని చేద్దాం! అని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.






