- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ చీరల పంపిణీలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పేద, అర్హులైన మహిళలకు ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా చీరలను పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలకు చీరలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఇందిరమ్మ చీరల పంపిణీలో పాల్గోన్నారు. కరీంనగర్ స్వశక్తి కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు సారె క్రింద చీరలు అందించే సంప్రదాయాన్ని రాష్ట్రంలో మొదటిసారిగా మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. కాగా ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Tags
- BRS MLA






