- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ MLA కౌశిక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) మరో బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) మరో బిగ్ షాక్ తగిలింది. కాజీపేటలోని రైల్వే కోర్టు(Kazipet Railway Court) కౌశిక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. క్వారీ యజమాని మనోజ్‌ను బెదిరించిన కేసులో రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కౌశిక్ రెడ్డిని ఖమ్మం జిల్లా జైలుకు పోలీసులు తరలించబోతున్నారు.
కాగా, ఇటీవల హుజురాబాద్‌కు చెందిన ఓ గ్రానైట్ వ్యాపారిని బెదిరించి రూ.50లక్షలు డిమాండ్ చేశాడని బాధితులు సుబేదార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఏప్రిల్ 21వ తేదీన కౌషిక్ రెడ్డిపై 308(2), 308(4), 308(5) 352 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య కాజీపేటలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న రైల్వే కోర్టు కౌశిక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది.






