- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్లపై గంగుల సూచనలు.. అపశకునాలు వద్దన్న మంత్రి పొన్నం
రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడివేడిగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడివేడిగా జరుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై (BC Reservation Bill) సూచనలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar)ను కోరగా ఆయన కీలక సూచన చేశారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు 9వ షెడ్యూల్ లో మార్పు చేసే ప్రయత్నం చేయాలని తెలిపారు. బీఆర్ఎస్ అంటే బహుజర రాష్ట్రసమితి అని, తాము చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్సే.. 42 శాతం బీసీలను తమ మంత్రివర్గం నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై శాస్త్రీయంగా సర్వే చేయకపోతే చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై నేడు మాట్లాడుతున్న బీఆర్ఎస్.. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్న వేళ అపశకునాలు పలకవద్దని సూచించారు.






