- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా ఉద్యమం వస్తే ఎవరూ ఆపలేరు.. ‘గో బ్యాక్ మార్వాడీ’ ఇష్యూపై BRS నేత
గో బ్యాక్ మార్వాడీ(Go Back Marwadi) ఇష్యూపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గో బ్యాక్ మార్వాడీ(Go Back Marwadi) ఇష్యూపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నపళంగా ఇప్పటికిప్పుడు మార్వాడీల విధానాలు ఎవరికి ఇబ్బందిగా మారాయి.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దు అని అన్నారు. ఇది కాంగ్రెస్, బీజేపీ రాజకీయ క్రీడ అని ఆరోపించారు. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక వైషమ్యాలు పెరిగాయని అన్నారు. బీజేపీ ప్రయత్నమే వారికి రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. పెరిగి పెద్దదై ప్రజా ఉద్యమంగా మారితే ఎవరూ ఆపలేరు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. వాద, వివాదాలు ఎలా ఉన్నా ‘మార్వాడీ గో బ్యాక్’ అంటూ సోషల్మీడియాలో వైరలవడంతో అది కాస్త రాజకీయ రంగును పులుముకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఈ అంశంపై రాజకీయ నేతలు మాట్లాడకుండా ఉండటం లేదు. ఈ అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ‘మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని బండి సంజయ్ మండిపడగా, మార్వాడీలు మనలో భాగమే అని కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. దీంతో ఇది ఎటు దారి తీస్తుందో అని ఆసక్తి నెలకొంది.






