MLC Kavitha: కవితపై చర్యలు తప్పవా..? ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో నేతలతో కేసీఆర్ కీలక భేటీ

by Ramesh Naini |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారి హీటెక్కాయి.

MLC Kavitha: కవితపై చర్యలు తప్పవా..? ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో నేతలతో కేసీఆర్ కీలక భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారి హీటెక్కాయి. కవిత కామెంట్స్ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయినట్లు తెలిసింది. ఉదయం నుంచి ఫామ్‌హౌస్‌లో ఉన్న కేటీఆర్.. కవిత ప్రెస్‌మీట్ తర్వాత సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితర నేతలు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ అధినేత ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకుంటారంటూ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఫామ్‌హౌస్‌లో సమావేశాల అనంతరం బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, కవిత వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని, ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపంచే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. కవిత చేసిన ఆరోపణలు, పార్టీ లోపల తలెత్తుతున్న విభేదాలు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి వరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.

ఆరడుగుల బుల్లెట్టు.. బీఆర్ఎస్ కౌంటర్..

కవిత ప్రెస్‌మీట్ తర్వాత కొద్దిసేపటికే హరీశ్‌రావుపై బీఆర్ఎస్ కౌంటర్ ట్వీట్ చేసింది. హరీశ్‌రావు ఆరడుగుల బుల్లెట్ అంటూ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా పోస్ట్ చేసింది. నిన్న అసెంబ్లీలో కాళేశ్వరంపై జరిగిన చర్చకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. ‘సింహం సింగిల్‌గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీశ్‌రావు..’ అంటూ పోస్ట్ చేసింది.

Next Story