- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రతా దృష్ట్యా డ్రోన్‌కు అనుమతి ఇవ్వండి.. CP సజ్జనార్‌కు బీఆర్ఎస్ విజ్ఞప్తి
జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు రోడ్ షోలకు డ్రోన్ అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు రోడ్ షోలకు డ్రోన్ అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. పూర్తిస్థాయి తమ సెక్యూరిటీ ఆధీనంలోనే ఉండేలా డ్రోన్ అనుమతి కోసం సీపీని కలిసినట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ మాట్లాడుతూ.. పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు ఈ ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ప్రచారానికి డ్రోన్లు వాడుకుంటామని తెలియజేసినట్లు తెలిపారు. సీపీ సైతం సానుకూలంగా స్పందించారని చెప్పారు. భయభ్రాంతులకు గురిచేసి పార్టీ పెద్దలైన కేటీఆర్, హరీశ్‌రావుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తలకు భద్రత కోసం ఈ డ్రోన్లు వినియోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు నాగేందర్‌గౌడ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు.






