- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIRపై అనుమానాలు.. ఈసీని కలిసిన బీఆర్ఎస్
ఎస్ఐఆర్ ప్రక్రియలో కొన్ని అనుమానాలు ఉన్నాయని.. వాటిని సీఈవోకు వివరించామని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఐఆర్ ప్రక్రియలో కొన్ని అనుమానాలు ఉన్నాయని.. వాటిని సీఈవోకు వివరించామని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. మంగళవారం వినోద్‌కుమార్, బీఆర్ఎస్ నేతలు సీఈవో సుదర్శన్‌రెడ్డి, ఇతర అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్‌పై వారికి వినతిపత్రం అందించారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల శుద్ధి కార్యక్రమం చేపడుతున్నదని.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి శుద్ధి కార్యక్రమం నడుస్తున్నదని అన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త ఫొటోలు ఇవ్వాలని చెప్తున్నారని.. గ్రామీణ స్థాయిలో ఉన్న వారికి ఎలాంటి అవగాహన లేదని తెలిపారు. బీఎల్ఓలే కాకుండా.. బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. కేసీఆర్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు. జూన్ నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం అవుతుందని చెబుతున్నారని.. అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కోరామని తెలిపారు.






