‘రేవంత్ రెడ్డి లాగా బూతులేం మాట్లాడలేదు కదా’.. జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ నేత ఫైర్

by Gantepaka Srikanth |

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌(Speaker Gaddam Prasad Kumar)పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy)పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.

‘రేవంత్ రెడ్డి లాగా బూతులేం మాట్లాడలేదు కదా’.. జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ నేత ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌(Speaker Gaddam Prasad Kumar)పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy)పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై ఆ పార్టీ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పిరికిపంద చర్య.. జగదీష్ రెడ్డి ఎక్కడా సభా గౌరవాన్ని కించపరచలేదు.. రేవంత్ రెడ్డి లాగా బూతులు మాట్లాడి తగ్గించలేదు.. చట్టవిరుద్ద చర్యలకు కూడా పాల్పడలేదు. కేవలం ఏకవచనంతో మాట్లాడారన్న అపవాదుతో సస్పెండ్ చేయడం వెనుక మీ భయం, ఆందోళన కనబడుతున్నది. ఆయన అలా మాట్లాడితే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడాల్సింది లేదా, క్షమాపణ కోరాల్సింది.. కానీ ఏకపక్షంగా సస్పెండ్ చేయడం మీ చేతగాని తనానికి నిదర్శనం’ అని విమర్శించారు.

‘మీరు సస్పెండ్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నించడం ఆపదు.. మీ కమీషన్ల గురించి ఎక్కడ ప్రజలకు చెబుతారోనన్న భయంతోనే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును ఖండిస్తున్నామని’ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Next Story