- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ముక్కు నేలకు రాసినా కాంగ్రెస్ గెలవదు
కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసినా ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మెన్ ఎన్నికల్లో గెలవలేరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసినా ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మెన్ ఎన్నికల్లో గెలవలేరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శికి బీఆర్ఎస్ నేతలు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు అంటే అధికార పార్టీకి లబ్ధిచేకూర్చే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు ఇంత దుర్మార్గానికి పాల్పడరని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రజల తీర్పును హత్య చేస్తున్నారని, ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని అన్నారు. యాదగిరి అనే కౌన్సిలర్ బీఆర్ఎస్ బీఫామ్‌పై గెలిచారని, అయినా 16వ తేదీన కౌన్సిల్‌కు హాజరు కాలేదని, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎన్నికకు రాకపోతే కేసు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టాలి కానీ కాంగ్రెస్ వాళ్లు కేసు పెట్టారని వివరించారు.
కోర్టు ఆర్డర్ అమలు చేయడం లేదు..
ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులకు సిగ్గు, శరం ఉందా? ప్రశ్నించారు. 18వ తేదీన హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా అమలు చేయడం లేదని అన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిపై కేసులు పెట్టారని తెలిపారు. పోలీసులు రేవంత్ రెడ్డికి తొత్తులుగా పని చేస్తున్నారని విమర్శించారు. క్యాతనపల్లి, తొర్రూరులో ఇలాగే వ్యవహరించారని తెలిపారు. క్యాతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను జైలుకు పంపారని, కౌన్సిలర్లపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. వెంటనే ఇబ్రహీంపట్నంలో చైర్మన్‌ను ప్రకటించాలని, వైస్ ఛైర్మన్ ఎన్నికను నిర్వహించాలని డిమాండ్ చేశారు. క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్‌ను ఇబ్బందులు పెడుతున్నారని సరైన ఆహారం, నీరు ఇవ్వడం లేదన్నారు.






