- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నాయకులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవిత, మన్నె గోవర్దన్ రెడ్డి శనివారం (Banjara Hills) బంజారాహిల్స్ పీఎస్‌లో సీఎం రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. జూలై 18 వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొల్లాపూర్ పరిధిలో జరిగిన బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో ‘కేసీఆర్ నువ్వు బాయిలో దూకుతావో, పెట్రోల్ పోసుకొని తగల పెట్టుకుంటావో అది నీ ఇష్టం.. నువ్వు అసెంబ్లీకి వచ్చి అపోజిషన్లో కూర్చొని మేము చేసే మంచి పనులు చెప్తుంటే కుమిలి కుమిలి ఏడవాలి’ అని సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆత్మహత్యలను ప్రమోట్ చేసే విధంగా ఉన్నాయని, ఒక ఉన్నత మైన పదవిలో ఉండి ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడం అప్రజాస్వామ్యం అని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులో రాసుకొచ్చారు.






