తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్ ఫాల్ మొదలైంది: BRS

by Gantepaka Srikanth |

రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప.. చేతలు లేవని బీఆర్ఎస్(BRS) నేత చిరుమళ్ల రాకేష్ కుమార్(Rakesh Kumar) విమర్శించారు.

తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్ ఫాల్ మొదలైంది: BRS
X

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప.. చేతలు లేవని బీఆర్ఎస్(BRS) నేత చిరుమళ్ల రాకేష్ కుమార్(Rakesh Kumar) విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా.. పెంచి ఇస్తామన్న పింఛన్లు ఇవ్వడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు లేవు. రైతు భరోసా లేదు. మహిళలకు రూ.2500 లేవు. ఇలా చెప్పుకుంటూ ఎన్నో హామీలను విస్మరించారని అన్నారు. రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం వేసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకుంటున్నారే తప్ప రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.

మోసపు మాటలతో రేవంత్ ప్రభుత్వం పేదల బతుకుల్ని ఆగం చేస్తోందని అన్నారు. కేసీఆర్(KCR) హయాంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా 6 లక్షల 47 వేల రేషన్ కార్డులు(Ration cards) జారీ చేశారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అసెంబ్లీలో చెప్పారని వెల్లడించారు. ఇకనైనా కేసీఆర్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదనే తప్పుడు కూతల్ని కాంగ్రెస్ నేతలు బంద్ చేయాలని హితవు పలికారు. కార్డులో కొత్త పేర్లు నమోదు చేయాల్సింది పోయి ఉన్న పేర్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) కోసమే కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నట్టు హడావుడి చేశారు. ఇపుడు ఎన్నికలను వాయిదా వేశారు కాబట్టి పథకాల గురించి మాట్లాడటం లేదని అన్నారు. రేవంత్ పాలనలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీని మార్చారు.. ఇంకెవర్ని మారుస్తారో అని కాంగ్రెస్‌లో చర్చ మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ అధికారం(Congress Government)లోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ రైజింగ్ పోయి.. తెలంగాణ డౌన్ ఫాల్ మొదలైందని అన్నారు.

Next Story