BRS: ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారు?

by Gantepaka Srikanth |

ప్రభుత్వమే ఆర్టీసీ సమ్మెను అణిచివేసే కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

BRS: ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వమే ఆర్టీసీ సమ్మెను అణిచివేసే కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. శంకర్ ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్య అని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు టెంట్ హౌస్ ఇవ్వకూడదని.. తాండూరు పోలీస్ వారు ఇచ్చిన నోటీసు భయానకంగా ఉన్నదన్నారు. పరిస్థితి చూస్తుంటే ఆర్టీసీ కార్మికుల వార్తలు రాస్తున్న విలేకరులపై కేసులు నమోదు చేస్తారేమో అనిపిస్తుందని తెలిపారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి

ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మరణంపై ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఇది ముమ్మటికీ ప్రభుత్వ హత్యనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో రాక ముందు అలవికాని హామీలు ఇచ్చి ఒక్క ఆర్టీసీ సోదరులనే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అమలు చేయమంటున్నారని.. ఎందుకు మౌనంగా ఉంటున్నారు రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారని నిలదీశారు. శంకర్‌గౌడ్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయపరంగా పోరాటం చేద్దాం.. ప్రభుత్వం మెడలు వంచుదాం అని పిలుపునిచ్చారు.

Next Story