- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓడినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదు.. హరీశ్‌రావుకు ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్
మీ పాలన వద్దంటూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు చీకొట్టినా ఆ పార్టీ నేతలకు మాత్రం బుద్ధి రావడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మీ పాలన వద్దంటూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు చీకొట్టినా ఆ పార్టీ నేతలకు మాత్రం బుద్ధి రావడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తాగుబోతుల తెలంగాణగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హరీశ్‌రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పదేళ్లు కల్వకుంట్ల కుటుంబం ప్రైవేట్ లిమిటెడ్‌గా తయారై తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ దోచుకుందని అన్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడినా.. ప్రజా ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ఆడిపోసుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజా భవన్‌లోకి ఏ ఒక్క ప్రజాప్రతినిధిని రానీయని సంస్కృతిని తెచ్చింది బీఆర్ఎస్ పాలకులే కదా అని ప్రశ్నించారు. అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే ప్రగతిభవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చామని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా హరీశ్ రావు చేసిన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రపంచ స్థాయి గ్లోబల్ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు. సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి 3 వేలకు పైగా ప్రతినిధులు వచ్చారని పేర్కొన్నారు. ఈ దెబ్బతో తెలంగాణ (Telangana) పేరు విశ్వవ్యాప్తమవుతుందని తెలిపారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజునే సుమారు రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని అన్నారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రజాభవన్‌లో ఉంటే చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ దుబాయ్ కేంద్రంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాట్సాప్ యూనివర్సిటీలను తెరిచిందని, తద్వారా ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.






