ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. BRS నేత ప్రకటన

by Gantepaka Srikanth |

ప్రణయ్ హత్య కేసు(Pranay Murder Case)లో కాస్త ఆలస్యమైనా కోర్టు మంచి తీర్పే ఇచ్చిందని బీఆర్ఎస్(BRS) నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు.

ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. BRS నేత ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రణయ్ హత్య కేసు(Pranay Murder Case)లో కాస్త ఆలస్యమైనా కోర్టు మంచి తీర్పే ఇచ్చిందని బీఆర్ఎస్(BRS) నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు. నల్లగొండ కోర్టు(Nalgonda Court) తీర్పుపై స్పందిస్తూ సోమవారం సోషల్ మీడియా(X)లో ఆయన ట్వీట్ పెట్టారు. ‘‘చాలా ఆలస్యమైనా ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. ఈ తీర్పును వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం నిష్ణాతులైన న్యాయవాదులను నియమించి మళ్లీ దోషులకు పై కోర్టులో శిక్షలు తగ్గకుండా చూడాలి. పరువు హత్యలన్నింటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకందరికీ ఇలాగే కఠిన శిక్షలు పడేలా చూడాలి. కులాంతర-మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు మరియు రక్షణ కల్పించాలి’’ అని ట్వీట్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.


కాగా, తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య (Pranay Murder case)కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్‌కుమార్‌ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకున్నదనే కోపంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించిన సంగతి తెలిసిందే.

Next Story