‘CM రేవంత్‌పై ఈగ కూడా వాలట్లేదంటే.. ఆ 8 మందే కారణం’

by Gantepaka Srikanth |

దీపావళి(Diwali) చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) అన్నారు.

‘CM రేవంత్‌పై ఈగ కూడా వాలట్లేదంటే.. ఆ 8 మందే కారణం’
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali) చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన(Congress Govt) వచ్చినాక మంచిపై చెడు విజయం సాధిస్తున్నట్టుగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల్లో చీకట్లే కనిపిస్తున్నాయని చెప్పారు. నాడు కేటీఆర్ పారిశ్రామిక వేత్తలకు గొడుగులు పట్టి మరీ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించారు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలకు గన్‌లు పెట్టి బెదిరిస్తున్నారు.. ఇది చాలా విచారకరం అన్నారు. మరోవైపు మంత్రుల మధ్య సమన్వయం కనిపించడం లేదు.. వారికి ఒకరిని ఒకరు తిట్టుకోవడానికే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితమంత్రిని పట్టుకొని సహచర మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

జూబ్లీహిల్స్‌లో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేశారో లేదో చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఫ్యూడలిస్టు ఆలోచనలు కనిపిస్తున్నాయి.. బీజేపీతో కలిసిపోయి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పని చేస్తున్నారు. సదర్ ఉత్సవాల్లో ఇది తేటతెల్లం అయింది. రేవంత్ రెడ్డి జీన్స్‌లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది. తనది ఆర్‌ఎస్‌ఎస్ స్కూల్ అని రేవంత్ స్వయంగా చెప్పారని బాల్క సుమన్ గుర్తుచేశారు. బీజేపీ సీఎంల కన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు.. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు కూడా రేవంత్‌పై ఈగ వాలనీయడం లేదని సెటైర్ వేశారు.

Next Story