తెలంగాణను కూడా చంద్రబాబే పాలిస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణను కూడా చంద్రబాబే పాలిస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పాలిస్తోందని రేవంత్ రెడ్డి కాదని.. చంద్రబాబు పాలిస్తున్నారని ఆరోపించారు. ఏ పాలకుల మీదైతే పోరాడి తెలంగాణ సాధించుకున్నామో మళ్లీ ఆ పాలకులే రాజ్యమేలుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నామమాత్రంగా సీఎం కుర్చీలో కూర్చుకున్నారని.. పరిపాలన మొత్తం ఆంధ్రా పాలకులకే అప్పజెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదనే అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశ పెట్టారని విమర్శించారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన విద్వేశపూరిత ప్రసంగం, నేరాల నివారణ బిల్లు సోషల్‌మీడియాను కట్టడి చేయడానికేనని స్పష్టం చేస్తున్నది. దీంతో పాటు రాజకీయ పార్టీలు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాపైనా ప్రభావం పడే అవకాశముంది. వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ ఏదైనా పోస్ట్ పెడితే సంబంధిత వ్యక్తిపై మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఇప్పటివరకు ఉండేది. కానీ, ఈ చట్టంతో గ్రూపు సభ్యులపైనా కేసులు నమోదు చేసే అవకాశముంది.

Next Story