ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా: బీఆర్ఎస్ నేత ప్రకటన

by Gantepaka Srikanth |

‘కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు ఇవ్వనంత మాత్రాన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తారా? మా జిల్లా రైతులంటే ఎందుకంత చిన్నచూపు’ అని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌ రెడ్డి ప్రశ్నించారు.

ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా: బీఆర్ఎస్ నేత ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు ఇవ్వనంత మాత్రాన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తారా? మా జిల్లా రైతులంటే ఎందుకంత చిన్నచూపు’ అని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌ రెడ్డి ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనేది ఒకటి ఉన్నదనేది తెలుసా అని నిలదీశారు. హర్యానాలో గుర్గావ్ జిల్లా తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని.. దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే ఐదు జిల్లాల్లో ఈ జిల్లా ఒకటని గుర్తుచేశారు. ఈ జిల్లా రైతులకు రైతుభరోసా నిధులు ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణలో లేదా అని నిలదీశారు. ట్రిపుల్ వన్ జీవో విషయంలో రైతులకు మోసం చేశారని.. జిల్లా ప్రజల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా అని అన్నారు. వారం రోజుల్లో రైతుబంధు నిధులు రంగారెడ్డి జిల్లా రైతుల అకౌంట్లలో పడక పోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




Next Story