- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: సినీ కార్మికుల కష్టార్జితంతో సీఎం సభ
సినీ కార్మికుల కష్టార్జితం రూ.72 లక్షలను ఖర్చు పెట్టి సీఎం సభ పెట్టించారని.. సినీ కార్మికులను సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సినీ ఫెడరేషన్ వాళ్లను బెదిరించారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ కార్మికుల కష్టార్జితం రూ.72 లక్షలను ఖర్చు పెట్టి సీఎం సభ పెట్టించారని.. సినీ కార్మికులను సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సినీ ఫెడరేషన్ వాళ్లను బెదిరించారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కార్మికుల కష్టార్జితం రూ.72 లక్షలను తిరిగి ఫెడరేషన్ ఖాతాలో అభ్యర్థి నవీన్‌యాదవ్ జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పొట్టకొట్టి సీఎం జూబ్లీహిల్స్‌లో ఊరేగారని.. ఎన్నికల సంఘం నిబంధనల కంటే ఎక్కువ డబ్బులు కాంగ్రెస్ అభ్యర్థి ఖర్చు నవీన్‌యాదవ్ ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని తెలిసినా సభ పెట్టారని.. పోలీస్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ సభ పెట్టుకోవడానికి అనుమతి ఎట్లా ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వెంటనే కాంగ్రెస్ అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.
ఫెడరేషన్ అధ్యక్షుడి ఆడియో, ఇతర కార్మికుల ప్రకటనలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సభ పెట్టారనడానికి రుజువుగా సరిపోతాయని.. కాంగ్రెస్ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పని చేయకపోతే పరిమితికి మించి ఎన్నికల ఖర్చు పెట్టిన నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై వేటు వేయాలని అన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థనా అని ప్రశ్నించారు. మొంథా తుపాన్ ప్రభావాన్ని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఏపీ తగిన ముందస్తు చర్యలు తీసుకుని తుపాన్ నష్టం నుంచి తప్పించుకుందన్నారు. సీఎం, మంత్రుల మొద్దు నిద్ర వల్ల తెలంగాణలో అనేక జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.
12 మంది ప్రాణాలు కోల్పవడానికి, మూగ జీవాలు మృత్యువాత పడడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రేవంత్ పాలనలో రైతులు నిండా మునిగారన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగిందన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. నిబంధనలు సడలించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ నేతలు లక్ష్మణ్‌రావు, పల్లె రవికుమార్, కె.కిశోర్‌గౌడ్, రామచంద్రునాయక్ పాల్గొన్నారు.






