మల్లారెడ్డి నెక్స్ట్ లెవెల్..! టైమ్ మెషిన్‌లో వెనక్కి వెళ్లి మహనీయులను కలిసిన మాజీ మంత్రి

by Ramesh Naini |   (  Updated:2025-05-31 11:51:33  IST  )

బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.

మల్లారెడ్డి నెక్స్ట్ లెవెల్..! టైమ్ మెషిన్‌లో వెనక్కి వెళ్లి మహనీయులను కలిసిన మాజీ మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla reddy) ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా చేసిన మల్లారెడ్డి.. స్పీచ్‌లతో అదరగొడుతూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ఉంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఇవాళ (శనివారం) తన ఎక్స్ ఖాతా వేదికగా టైమ్ మెషిన్ అంటూ ఓ ఏఐ వీడియో పోస్ట్ చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ (Mallareddy University) ప్రమోషన్స్‌లో భాగంగా ఏఐ వీడియో క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. దేశ భవిష్యత్ నిర్మాణానికి మంచి విద్యాసంస్థలు స్థాపించాలని బుద్దుడు, స్వామి వివేకానంద లాంటి మహనీయులు చెప్పినట్లుగా ఏఐ వీడియో (AI Video) రూపోందించారు. వీడియోలో చూపించిన ప్రకారం.. మల్లారెడ్డి టైమ్ మెషిన్‌లోవెనకటి కాలానికి వెళ్లారు. నాటి కాలం మహానీయులు గౌతమ బుద్ధుడు, పీఠాధిపతులు, చాణక్యుడు, స్వామి వివేకానంద, మధర్ తెరిస్సా, మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ వంటి వారిని కలిశారు.

తర్వాత మహానీయులు చెప్పినట్లుగా ప్రస్తుత కాలానికి అదే (Time Machine) టైమ్ మెషిన్‌‌లో వచ్చేస్తాడు. మహానీయుల ఆశయాలు నిలబెడతానని, దేశంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం నెలకొల్పుతానని వీడియోలో మల్లారెడ్డి భరోసా ఇస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. మల్లారెడ్డి అంటే పేరు కాదని, అది ఒక బ్రాండ్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఒక పక్క బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత కామెంట్స్‌ దుమారం అవుతుంటే.. మనోడు ఏఐతో సెల్ఫ్ ఎలివేషన్స్ షురూ చేసిండని మరో నెటిజన్ కామెంట్ ఆసక్తిగా మారింది. ‘టైమ్ మిషన్‌లో నయీంను కూడా కలిసినట్లున్నాడు.. కబ్జాలు ఎలా చేయాలో చెప్పినట్లున్నాడు’ అంటూ మరో నెటిజన్ మాజీ మంత్రిని తీవ్ర విమర్శలు చేశారు.

Next Story