- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరి ప్రయోజనం కోసం మహేశ్ కుమార్ గౌడ్ నిందలు: శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ అడ్డుకుంటున్నదని మహేశ్‌కుమార్‌గౌడ్ అనడం సరైందని కాదని.. ఎవరి ప్రయోజనం కోసం ఆయన బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ అడ్డుకుంటున్నదని మహేశ్‌కుమార్‌గౌడ్ అనడం సరైందని కాదని.. ఎవరి ప్రయోజనం కోసం ఆయన బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దొంగే దొంగ అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ నిలదీయాల్సింది రేవంత్ రెడ్డిని అని సూచించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో గందరగోళానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం బీసీలకు ద్రోహం చేసిందని తెలిపారు.
తాను స్పీకర్‌గా ఉన్నప్పుడు బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర కేసీఆర్‌కు దక్కిందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా కేబినెట్ ర్యాంక్ మూడు పదవుల్లో రెండు బీసీలకు ఇచ్చారని తెలిపారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు తెలంగాణలో బీసీలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తూతూమంత్రంగా ఢిల్లీలో ధర్నాలు చేశారని.. జీవోలతో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుందా అని నిలదీశారు. 18న బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిశోర్‌గౌడ్, శుభప్రద్ పటేల్, టీజీపీఎస్‌సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ పాల్గొన్నారు.






