MLA Maganti Gopinath: మాగంటి కన్నుమూత ఎఫెక్ట్.. KTR కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-08 04:18:49  IST  )

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు.

MLA Maganti Gopinath: మాగంటి కన్నుమూత ఎఫెక్ట్.. KTR కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి నల్గొండ, ఖమ్మం జిల్లాల పర్యటనను రద్దు చేశారు. గోపీనాథ్ మరణ వార్త తెలుసుకున్న వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. మాగంటి గోపినాథ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గోపీనాథ్ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని మాదాపూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story